Bigg Boss Telugu Season 10: బిగ్ బాస్10 హౌస్ లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలు వీరే? లీక్డ్ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్!

Bigg Boss Telugu Season 10: బిగ్ బాస్10 హౌస్ లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలు వీరే? లీక్డ్ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్!

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' సందడికి సమయం ఆసన్నమైంది. తెలుగులో తొమ్మిది సీజన్లగా ప్రేక్షకులను అలరించిన ఈ షో.. ఇప్పుడు పదో సీజన్‌ మరింత గ్రాండ్‌గా రాబోతోంది. ఈ సారి 'దశావతారం' అనే కొత్త కాన్సెప్ట్‌తో సీజన్ 10ను డిజైన్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన 'బిగ్ బాబ్ తెలుగు సీజన్ 10' సంబంధించిన ప్రొమోలు ఈ షోపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.  ఇక ఎప్పటిలాగే అక్కినేని నాగార్జున హోస్ట్‌గా కనిపించనున్నారు.

సెలబ్రిటీల లిస్ట్ ఇదే..

అయితే ప్రస్తుతం అసలు కిక్ ఇచ్చేది సెలబ్రిటీల కంటెస్టెంట్ల లిస్ట్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతోంది. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీల పేర్లు అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. ఇందులో సీరియల్ భామ దేబ్జానీ , 'గుప్పెడంత మనసు'తో రిషి సార్‌గా ఫేమస్ అయిన ముఖేష్ గౌడ, యాంకర్ వర్షిణి, జబర్దస్త్ కమెడియన్లు రామ్ ప్రసాద్, నరేష్, నటుడు కృష్ణుడు, చైత్ర రాయ్, యాంకర్ సుధీర్ రెడ్డి, టెంపర్ వంశీ, అదిత్ ఈశ్వరన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వీరిలో ముఖేష్ గౌడ ఎంట్రీ ఇస్తే మాత్రం షోకు భారీ క్రేజ్ రావడం ఖాయమనే చర్చ జరుగుతోంది. మరోవైపు జబర్దస్త్ కమెడియన్లు వస్తే హౌస్‌లో నవ్వులకే కాదు.. టాస్కులు, గొడవలు, ఎంటర్టైన్మెంట్‌కు కూడా కొదవ ఉండదని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.  మరోవైపు కామనర్స్ విషయంలోనూ బిగ్ బాస్ టీమ్ భారీ ప్లాన్ వేసింది. సెలబ్రిటీలతో పోటీ పడే టాప్ 5 సామాన్యుల ఎంపి జరుగుతోంది.

హౌస్ లోకి టాప్ 5 కామనర్స్..

గత సీజన్‌లో కామనర్‌గా వచ్చి విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాల తర్వాత.. సామాన్యులపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అందుకే 'అగ్నిపరీక్ష సీజన్ 2' ద్వారా ఎంపికైన టాప్ 15లో నుంచి కొందరిని హౌస్‌లోకి పంపనున్నారు.  ప్రస్తుతం టాప్ 15 లో రాజకుమారి, శ్రష్టి, ఝాన్సీ, అపూర్వ, షాలిని, ప్రియాంక, గాయత్రి, రోహిత్ నాయుడు, అమన్, హేమంత్, చరణ్, మిథిలేష్, రామకృష్ణ, దీపక్ తదితరుల పేర్లు ఈ రేసులో వినిపిస్తున్నాయి. ఈ ' అగ్నిపరీక్ష ' టాస్క్ లో టాప్ 5 గా నిలిచిన వారిని బిగ్ బాస్ హౌస్ లో పంపనున్నారు. 

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సెలబ్రిటీల పేర్లలో అసలు ఎంతమంది నిజంగా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెడతారనేది సస్పెన్స్. గతంలోనూ చివరి నిమిషంలో పేర్లు మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు అసలు లిస్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ' ను సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానుందని సమాచారం.  మరి ఈ సారి ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలతో సామాన్యులు ఏమేరకు పోటీ ఇచ్చి కప్ గెలుస్తారో చూడాలి.