
మీర్జాపూర్(Mirzapur).. ఈ వెబ్ సిరీస్ కు చాలా ప్రత్యేకత ఉంది. పిలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ వచ్చిన ఈ సిరీస్ భారీ విజయాన్ని సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే.. వెబ్ సిరీస్ లలో ఒక ట్రెండ్ సెట్ చేసింది మీర్జాపూర్. బాలీవుడ్ నుండి తెలుగుకి డబ్ అయ్యి వచ్చిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులకు బాగా ఎక్కేసింది. ఇప్పటికే రెండు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ థర్డ్ సీజన్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
తాజాగా మీర్జాపూర్ సీజన్ 3పై బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే మూడో సీజన్ కు సంబంధించిన షూటింగ్ ఏడాది క్రితమే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సిరీస్.. మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది. దీంతో మున్నాభయ్యా, గుడ్డు పండిట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇక గత సీజన్లకు మించి ఈ సీజన్ ఉండబోతుంది. సీన్స్ పరంగా కానీ, డైలాగ్స్ పరంగా కానీ నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందట. ఎమోషనల్ కంటెంట్ కూడా బాగానే సెట్ చేశారట ఈ సిరీస్ కోసం. దీంతో సీజన్ 3పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మరి భారీ హైప్ తో వస్తున్న మీర్జాపూర్ సీజన్ 3 ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.