లారీ బీభత్సం.. బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన లారీ

లారీ బీభత్సం..  బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన లారీ

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. బైకును వెనకనుంచి ఢీకొట్టింది లారీ. దీంతో బైక్ లారీ టైర్ కింద పడిపోయింది. లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. బైక్ వదిలేసి లారీ బానెట్ పైకి ఎక్కాడు వాహనదారుడు. రెండు కిలోమీటర్ల వరకు లారీని ఆపకుండా వెళ్లిపోయాడు లారీ డ్రైవర్. రెండు కిలోమీటర్ల వరకు బ్యానెట్ పైనే నిల్చుని లారీ ఆపాలని చెప్పినా డ్రైవర్ వినిపించుకోలేదు. 

రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో బ్రేకులు వేశాడు లారీ డ్రైవర్. చంద్రాయణగుట్ట నుంచి వనస్థలిపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లారీ వెనకాల ఉండి దీనిని మొత్తం సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు వాహనదారులు. వీడియో ఆధారంగా లారీ డ్రైవర్ ను పట్టుకున్నారు పోలీసులు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.