viral video: నడిరోడ్డుపై రీల్స్ చేసిన మహిళ బైక్‪పై వచ్చి మెడలో పుస్తె చోరీ

viral video: నడిరోడ్డుపై రీల్స్ చేసిన మహిళ బైక్‪పై వచ్చి మెడలో పుస్తె చోరీ

సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవాలని కోరికతో జనాలు ఎంతకైనా తెగిస్తున్నారు. రీల్స్ చేస్తూ తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొంతమంది సర్వం కోల్పోతున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సరిహద్దు జిల్లా అయిన ఘజియాబాద్ లో పాపం రీల్ వీడియో షూట్ చేస్తున్న మహిళ మెడలో నుంచి మంగళసూత్రం చోరీ చేశాడు ఓ చైన్ స్నాచర్. 

ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మహిళ అందంగా ముస్తాబై రోడ్డు మీద రీల్స్ చేస్తోంది. ఆమె అటెంషన్ అంతా కెమెరాపై ఉండగా ఇదే.. అదునుగా భావించిన ఓ దొంగ బైక్ పై వచ్చి ఆమె మెడలో మంగళసూత్రాన్ని లాక్కెల్లాడు. ఇదంతా రీల్ చేద్దామని తీస్తున్న వీడియోలో రికార్డ్ అయింది. దొంగ హెల్మెంట్ పెట్టుకొని చోరీ చేయడంతో అతన్ని గుర్తించలేక పోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.