చిన్నప్పటినుంచీ అన్ని కూరగాయలని తినేవాళ్లని కూడా కాస్త భయపెట్టే కూరగాయ ఒక్కటే కాకరకాయ. చూడటానికి కూడా పొక్కులుపొక్కులుగా ఉండటమే కాదు రుచి కూడా చేదు కావడంతో చాలామంది కాకరకు దూరంగా ఉంటారు. అయితే ఒక్కసారి కూర కాస్త చేదుగా తగిలిందని జీవితాంతం కాకరని దూరం చేసుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ఈ చేదుతో ఉండే లాభాలు అన్నీఇన్నీకావు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . !
కాకర కాయ అనగానే దూరం పెట్టేవాళ్ళు, ఏదో పర్లేదులే అని తినేవాళ్లే తప్ప "నాకు కాకర కాయ ఇష్టం" అని చెప్పేవాళ్లు తక్కువ. అదీ నూనెలో వేసి వేపుడు చేస్తే తప్ప కూరగా ఇష్టపడే వాళ్ళు మరీ తక్కువ.
కాకర చేసే మేలు
కాకరకాయ ఆస్తమా, జలుబు, దగ్గు లాంటి రెస్పి రేటరీ సమస్యలకి మంచి మందు. ఇప్పుడు వర్షాకాలం సీజన్ వ్యాధుల భయంలో ఉన్న మనకి కాకర ఇంకా అవసరం. అందుకే చేదుని కూడా కాస్త ప్రేమిద్దాం...
స్కిన్, రెస్పిరేటరీ సమస్యలకి కాకరకాయ మంచి సొల్యూషన్. రెగ్యులర్ గా కాకర కాయని మన ఫుడ్ లో చేర్చుకుంటే బాడీలో ఉండే టాక్సిన్స్ తగ్గిపోతాయి. చిన్నచిన్న బ్యాక్టీరియాలు కూడా తొందరగా మన బాడీ నుంచి వెళ్ళిపో తాయి. కాకరలో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాసియం, జింక్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బాడీకి చాలా అవసరం. కాకరలో ఉండే సి, ఏ, జింక్ విటమిన్ల వల్ల స్కిన్ హెల్తీగా మారుతుంది.
తలకు కాకర గుజ్జును రాస్తే చుండ్రు సమస్య తగ్గి, జుట్టు నిగనిగలాడు తుంది. ఇక హెవీ ఆల్కహాలిక్స్ కి కూడా కాకరకాయ అమృతంతో సమానం అంటారు. కాకర రసం తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుందంటారు. కాకర జ్యూస్ మేలు చేస్తుంది.
న్యూట్రిషన్స్ ఎక్కువే...
వంద గ్రాముల కాకరకాయలో మొత్తం కాలరీలు 16, ఫైబర్ 2.6 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 3.4 గ్రాములు, కొవ్వు 158 మిల్లీ గ్రాములు, వాటర్ 87.4 గ్రాములు, ప్రొటీన్ 930 మిల్లీ గ్రాములు చొప్పున ఉంటాయి.
చేదు కాదు అమృతం
కాకర కాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. మన ఫుడ్ లో పారసైట్స్ ఉన్నా వాటిని చంపేస్తుంది. అంటే ఫుడ్ ని క్లీన్ చేస్తుందన్నమాట. ఇక ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల డైజేషన్ బాగుంటుంది.
డయాబెటిస్ ఉన్నవాళ్ళకి
కాకర డయాబెటిస్ ఉన్నవాళ్లకి బాగా మేలు చేస్తుంది. యాంటీ డయాబెటిక్ ని కంట్రోల్ చేసే పాలీపెప్టెడ్ పి, వైసిన్ లు నేచురల్ ఇన్సు లిన్ లాంటివి. ఇవి బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తాయి. రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గిం చడంలో చురుకుగా పనిచేస్తాయి. కాకరలో లెక్టిన్ ఉంటుంది. ఇది కూడా రక్తంలో గ్లూకోజ్ లెవల్ ను తగ్గించడానికి సాయపడుతుంది.. కాకరలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీని పెంచుతాయి. కాకర చెడు కొలెస్ట్రా ల్ ని కంట్రోల్ చేస్తుంది. గుండె దగ్గర ఉండే బ్లడ్ వెయిన్స్ లో పేరుకునే కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. కాకరలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం గుండెని రక్షిస్తాయి.
