వెంటనే ఎస్సైని సస్పెండ్ చేయండి

వెంటనే ఎస్సైని సస్పెండ్ చేయండి

కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ కు చెందిన పవన్ ను కొట్టిన ఎస్సైని సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ డిమాండ్ చేశారు.సీపీ... ఎస్సైపై చర్యలు తీసుకోకుండా విచారణ చేస్తామని కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ ను విచక్షణా రహితంగా కొట్టిన ఎస్సై పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు వ్యతిరేకంగా వాట్సప్ గ్రూపులో కామెంట్ పెట్టారనే ఆరోపణలతో పవన్ ను అరెస్ట్ చేశారని తెలిపారు. ఇదే కారణంతో పోలీసులు అతడిని తీవ్రంగా కొట్టారని మండిపడ్డారు బొడిగె శోభ.