కళ్యాణ్రామ్ కొత్త సినిమాలో తెలంగాణ బీజేపీ లీడర్

కళ్యాణ్రామ్ కొత్త సినిమాలో తెలంగాణ బీజేపీ లీడర్

వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో నందమూరి కథానాయకుడు..కళ్యాణ్ రామ్(NandamuriKalyanRam) ఒకరు. రీసెంట్‌గా విడుద‌లైన ‘బింబిసార’ చిత్రంతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్టర్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్( Devil) మూవీ 2023 నవంబర్ 24న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

రీసెంట్ గా కళ్యాణ్ రామ్ కొత్త సినిమాను (NKR21) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. అశోక క్రియేషన్స్’, ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్స్ సంయుక్త నిర్మిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీని నారా రోహిత్, నందమూరి తారకరత్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రాజా చెయ్యి వేస్తే సినిమాని తెరకెక్కించిన ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నారు.

అలాగే ఈ మూవీలో విజయశాంతి( Vijayashanthi) కీలక పాత్రలో నటిస్తుంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి..కాస్త బ్రేక్ తీసుకుని కళ్యాణ్ రామ్ సినిమాలో నటిస్తుంది. విజయశాంతి ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు సమాచారం. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతోన్నారు.