దక్షిణాదిలో పాగా వేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న బీజేపీ.. తమిళనాడును టార్గెట్ చేసింది. అన్నాడీఎంకేతో పాటు కలిసొచ్చే పార్టీలతో అధికారంలోకి రావాలని అక్కడ దూకుడు పెంచిన పార్టీకి నటుడు విజయ్.. టీవీకే పార్టీ పేరుతో సడెన్ షాక్ ఇచ్చాడు. దీంతో విజయ్ ను ఎన్డీఏలో చేర్చుకుంటే కుర్చీ మరింత సులువుగా దక్కుతుందని భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే ఎన్డీఏలో చేరాలని విజయ్ కు రాయభారం పంపింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విజయ్ ను ఒప్పించే పనిలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
లేటెస్టుగా విజయ్ కి బీజేపీ మరో ఆఫర్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఎన్డీఏలో చేరితో డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని.. అదే విధంగా 80 సీట్లు పోటీ చేసేందుక అవకాశం ఇస్తామని చెప్పినట్లు తమిళవర్గాలలో ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తం 234 సీట్లున్న తమిళనాడులో 80 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే విజయ్ ఇప్పటికే పలుమార్లు బీజేపీతో పొత్తు ఉండదని చెప్తూ వస్తున్నాడు. బీజేపీతో తమకు సైద్ధాంతిక వ్యతిరేక ఉన్నట్లు ప్రకటించారు. ముందు నుంచే సీఎం కుర్చీమీద ఫోకస్ చేసిన విజయ్.. బీజేపీ ఆఫర్ చేస్తున్న డిప్యూటీ సీఎం పోస్టును అంగీకరిస్తారా అనేది చూడాలి.
బీజేపీ విజయ్ వైపు చూడటానికి కారణం.. అతనికి ఉన్న ఫ్యాన్ బేస్. తమిళనాడు వ్యాప్తంగా అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉన్న విజయ్.. రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండు శాతం ఓట్లు కూడా తమిళ ఫలితాలను మార్చే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. ఇలాంటి తరుణంలో భారీ ఎత్తున ఓట్ షేర్ కొల్లగొడతాడనే ఊహాగానాలున్న తరుణంలో.. విజయ్ ని కలుపుకోవడమే తమకు బెస్ట్ ఆప్షన్ గా బీజేపీ భావిస్తోంది. మరి ఈ ఆఫర్ ను విజయ్ అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి.
