యాక్షన్ కింగ్ అర్జున్ స్క్రీన్‌పైకి వచ్చారంటేనే థియేటర్లలో విజిళ్లు, క్లాప్స్ మోత మోగిపోవాల్సిందే. ఆయన లీడ్ రోల్‌లో, అభిరామి , 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఫేమ్ ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘బ్లాస్ట్ జోన్’ (Blast Zone). ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది.. ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్..
ట్రైలర్ చూస్తుంటే ఇదొక హై-వోల్టేజ్ సస్పెన్స్, ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ అని క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. వందల కోట్ల నోట్ల కట్టలతో ఉన్న ఒక సీక్రెట్ కంటైనర్‌ను కొందరు వ్యక్తులు తరలిస్తూ ఉంటారు. అసలు ఆ సొమ్ము ఎక్కడిది? దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అనే సస్పెన్స్ నడుస్తుండగా.. ఈ క్రేజీ మనీ ఛేజింగ్ వ్యవహారంలోకి ఒక సాదాసీదా హెడ్‌మాస్టర్ (అర్జున్) ఫ్యామిలీ ఊహించని విధంగా ఎంటర్ అవుతుంది.
ట్విస్ట్ ఏంటంటే... ఆ హెడ్‌మాస్టర్ ఫ్యామిలీ అంతా 'కరాటే' ఫైటర్స్! యాక్షన్ కింగ్ అర్జున్‌తో పాటు అభిరామి, ప్రీతి ముకుందన్ కూడా రౌడీల కాళ్ళు, చేతులు విరగ్గొడుతూ ట్రైలర్‌లో ఊరమాస్ ఫైట్స్ చేస్తూ కనిపించారు. ఆపదలో పడ్డ తమ కుటుంబాన్ని, కరాటే విద్యతో వాళ్ళు ఎలా కాపాడుకున్నారనేదే మెయిన్ స్టోరీ.
మే 28న థియేటర్లలో..
షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సుభాష్ కె.రాజ్ ఈ చిత్రానికి అద్భుతమైన స్క్రీన్‌ప్లే, హై-టెక్నికల్ వాల్యూస్‌తో ఫుల్-ప్యాక్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు. అర్జున్ క్లాసిక్ యాక్షన్ మ్యానరిజమ్స్, ప్రీతి ముకుందన్ గ్లామర్ అండ్ స్టంట్స్ సినిమాకు మేజర్ హైలైట్ కానున్నాయి. ఫ్యామిలీ సెంటిమెంట్‌కు వంద శాతం ప్యూర్ యాక్షన్ తోడైతే ఎలా ఉంటుందో చూడాలంటే మే 28 వరకు వెయిట్ చేయాల్సిందే..
