మలయాళంలో వంద కోట్లు కొల్లగొట్టిన 'బెత్లహేం కుడుంబ యూనిటి'.. తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్

మలయాళంలో వంద కోట్లు కొల్లగొట్టిన 'బెత్లహేం కుడుంబ యూనిటి'.. తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్

'ప్రేమలు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మమిత బైజు ఇప్పుడు ఆ మూవీ టీమ్ నుంచి వచ్చిన మరో చిత్రంతో హిట్ అందుకుంది. 'బెత్లహేం కుడుంబ యూనిటి' పేరుతో రూపొందిన ఈ మలయాళ చిత్రం త్వరలో తెలుగులోనూ విడుదల కాబోతోంది. గిరీశ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ నివిన్ పాలీ హీరోగా నటించగా, తనరు జంటగా మమితా బైజు నటించింది. ప్రముఖ మలయాళ హీరోఫహద్ పాటిక్ డిలీష్ పోతన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

తనకంటే వయసులో చిన్నదైన యువతితోప్రేమలో పడటం ఇందులో మెయిన్ కాన్సెప్ట్. నిజానికి ఇందులో మమిత పోషించిన పాత్రను సాయిపల్లవి చేయాల్సి ఉంది. డేట్స్ ఇష్యూతో ఆమె తప్పుకోవడంతో మమిత బైజును తీసుకున్నామని హీరో నివీన్  పాల్ ఇటీవల రివీల్ చేశాడు. ఈ నెల 21న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ వంద కోట్లకు పైగా సమాహేళ్లు రాబట్టింది. ప్రత్యంగిర సినిమాస్ సంస్థ సెప్టెంబర్ 4న తెలుగులో విడుదల చేస్తోంది.