రక్తదానం ప్రతి ఒక్కరు చేయగల పనిగానే కనిపించినా దీన్ని చేసేటప్పుడు కొన్ని ఆరోగ్య ప్రమాణాలను పాటించడం తప్పనిసరి . బీపీ అధికంగా ఉన్నవారు కూడా రక్తదానం ఇవ్వకూడదు. పల్స్ రేటు సాధారణంగా ఉన్నవారు మాత్రమే రక్తదానం చేయాలి. అలాగే గుండె జబ్బులు ఉన్నవారు, క్యాన్సర్ వంటి అనారోగ్యాలు ఉన్నవారు రక్తదానానికి దూరంగా ఉండాలి. అలాగే బీపీ.. షుగర్ ఉన్న వారు కూడా రక్తదానం చేయకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా బీపీ ( బ్లడ్ ప్రెజర్) ఉన్నవారు రక్తదానం చేస్తే ఎమవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం...
రక్తదానం ఎంతో గొప్పది. ఇది మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది. అందుకే రక్తదానం మహా దానం అనే పదం వచ్చింది. . రక్తం ఇవ్వాలంటే దాత పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి. దాత బరువు కనీసం 50 కిలోలు ఉండాలి. డయాస్టోలిక్ బీపీ 50 నుంచి 100 మధ్యగా, సిస్టోలిక్ బీపీ 100 నుంచి 180 మధ్యగా ఉండాలి. పల్స్ రేట్ 50 నుంచి 100 మధ్య ఉండాలి.
సాధారణంగా బీపీ ఉన్నవారికి బ్లడ్ ప్రెజర్ తరచుగా మారుతుంది. రక్తదానం చేసే సమయంలో బ్లడ్ ప్రెజర్ లో మార్పులు వస్తే దాని ప్రభావం గుండె .. మెదడు పై పడే అవకాశం. ఒక్కోసారి హర్ట్ బరస్ట్ అవుతుంది. ప్రెజర్ ఎక్కువైతే మెదడులో నరాలు తెగిపోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు బీపీ సాధారణ స్థాయి కన్నా తగ్గితే అపస్మరక స్థితిలో ( కోమా)కి వెళ్లే అవకాశం ఉంది. అందుకే నడి వయస్సులో ఉన్న కాని బీపీ వ్యాధితో బాధపడే వారిని.. బీపీ ఉన్న వారిని రక్తదానం చేయవద్దని వైద్యులు చెబుతుంటారు.
రక్తదానం ఇచ్చేందుకు వెళ్లిన వెంటనే ముందు బీపీ టెస్ట్ చేస్తారు. అందులో హెచ్చు తగ్గులు ఉన్నా.. గతంలో బీపీ ఉందని అనుమానం వచ్చిన సరే అలాంటి వారి నుంచి రక్తం తీసుకోరు. సున్నితంగా తిరస్కరించి వెనక్కు పంపుతారు.
రక్తం దానం చేసే వారు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి మూడు నెలలకొకసారి రక్తదానం చేయవచ్చు. ఎందుకంటే శరీరం స్వయంగా కొత్త రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. కానీ కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు రక్తం ఇవ్వకూడదు. హెచ్‌ఐవీ, హెపటైటిస్, క్యాన్సర్, క్షయ, గుండె జబ్బులు, బీపీ, డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయరాదు. మరో ముఖ్య విషయం ఏంటంటే మద్యం సేవించిన 24 గంటల తరువాత మాత్రమే రక్తదానం చేయాలి. ఇలాంటి ప్రమాణాలను పాటించి రక్తదానం చేయాలి.

