ఆకాశంలో జరిగే ఈ వింతను చూసి తీరాల్సిందే.. బ్లూ మూన్ ఎన్నిసార్లు వచ్చినా ఇది చాలా స్పెషల్..!

ఆకాశంలో జరిగే ఈ వింతను చూసి తీరాల్సిందే.. బ్లూ మూన్ ఎన్నిసార్లు వచ్చినా ఇది చాలా స్పెషల్..!

అప్పుడప్పు.. ఎప్పుడో ఒకసారి వచ్చే బ్లూ మూన్ అంటే చాలా మందికి ఎంతో ఆసక్తి ఉంటుంది. ప్రత్యేకంగా ఆ తేదీని, సమయాన్ని గుర్తుంచుకుని.. ఆకాశంలో జరిగే అద్భుతాన్ని చూడాలనుకుంటారు. అయితే బ్లూ మూన్లు ఎన్ని వచ్చినా 2026 మే 31 న వచ్చే పున్నమి అత్యంత ప్రత్యేకం అని అంటున్నారు.  దీని విశేషాలేంటో తెలుసుకుందాం.

బ్లూ మూన్ అంటే నీలి చందమామ అని కాదు. ఎప్పుడూ వచ్చే పున్నమి నాటి చంద్రుని కంటే కాస్త పెద్దదిగా ఉండటం స్పెషల్. దీనికి తోడు కొంత సైంటిఫిక్, కొంత జోతిష్య సంబంధమైన విశేషాలతో ఉండే బ్లూ మూన్ అంటే ఇండియాలో ఎంతో క్యూరియాసిటీ ఉంటుంది. 

  • బ్లూ మూన్ అంటే ఏంటి..?

ఒకే నెలలో రెండు సార్లు ఫుల్ మూన్ వస్తే దాన్ని బ్లూమూన్ అంటుంటారు. అంటే సింపుల్ గా.. రెండు పున్నమిలు ఒకే నెలలో కనిపిస్తే అది బ్లూమూన్. మే 31 అలాంటి బ్లూమూన్ ఏర్పడుతుంది. ప్రతి రెండు మూడు ఏండ్లకు ఒకసారి ఏర్పడే ఈ ఆకాశ అద్భుతం అంటే స్పెషలే కదా మరి. 

  • ఇండియాలో బ్లూ మూన్ ఎలా చూడాలి..?

మే 31 సూర్యాస్తమయం తర్వాత బ్లూ మూన్ ఏర్పడుతుంది. సాయంత్రం 6.30 నుంచి 7.30 మధ్యలో తూర్పు వైపు బ్లూ మూన్ కనిపిస్తుంది. 

ఆ సమయంలో వాతావరణ పరిస్థితులు సాధారణంగా ఉంటే.. అంటే ఎలాంటి వర్షం, మేఘాలు లేకుంటే క్లియర్ గా చూడవచ్చు. 

బ్లూ మూన్ రోజ ఇవి పాటించండి:

  • మే 31న చంద్రుడిని చూసిన తర్వాత  నీటిని సమర్పించండి.
  • తెల్లని మిఠాయిలు, బియ్యం లేదా పాలు దానం చేస్తే మంచిది.
  • మానసిక ప్రశాంతత, విశ్రాంతి కోసం కొంత సమయం ధ్యానం చేయండి.
  • ఇంటిలోకి సంతోషాన్ని, శ్రేయస్సును ఆహ్వానించడానికి కాసేపు వెన్నెల కింద కూర్చోండి.
  • లక్ష్మీదేవిని పూజించి నైవేద్యం వడ్డించండి.
  • మీ కుటుంబ శ్రేయస్సు, సంతోషం కోసం రాత్రిపూట ఒక దీపం వెలిగించండి.