
బీఎండబ్లూ ఎక్స్5 మోడల్‌లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కస్టమర్లకు శుక్రవారం పరిచయం చేయనుంది. ఈ కారు టీజర్ ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సాధారణ ఎక్స్ 5 మోడల్‌తో పోలిస్తే కొన్ని ఫీచర్లు యాడ్ చేశారు. ఫలితంగా ధర కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌లో మార్పులు చేయడంతో పాటు, బాణం ఆకారంలో ఉండే లైట్స్‌ను కంపెనీ అమర్చింది.