సూర్య మూవీలో బాబీ డియోల్‌‌

సూర్య మూవీలో బాబీ డియోల్‌‌

‘యానిమల్‌‌’ చిత్రంలో విలన్‌‌గా మెప్పించిన బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్‌‌.. వరుస సౌత్‌‌ సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘కంగువ’ ఒకటి. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు శివ దర్శకుడు. స్టూడియో గ్రీన్‌‌, యూవీ క్రియేషన్స్ సంస్థలు త్రీడీలో తెరకెక్కిస్తున్నాయి.

ఇందులో ఓ కీలకపాత్రను పోషిస్తున్నాడు బాబీ డియోల్. శనివారం తన పుట్టినరోజు. ఈ సందర్భంగా బాబీ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌‌ లుక్‌‌ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. ‘ఉధిరన్‌‌’ అనే రూత్‌‌లెస్‌‌, పవర్‌‌‌‌ఫుల్‌‌ క్యారెక్టర్‌‌‌‌లో తను నటిస్తున్నట్టు చెప్పారు. ఇందులో ఓ తెగ నాయకుడి పాత్రను బాబీ డియోల్ పోషిస్తున్నట్టు ఫస్ట్ లుక్‌‌ను బట్టి అర్థమవుతోంది.

మరోవైపు బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలోనూ బాబీడియోల్‌‌ విలన్‌‌గా నటిస్తున్నాడు. శనివారం బర్త్‌‌ డే విషెస్‌‌ తెలియజేస్తూ ఈ విషయాన్ని కన్‌‌ఫర్మ్ చేశారు మేకర్స్‌‌. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని శ్రీకర స్టూడియోస్‌‌ సమర్పణలో సితార ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్‌‌, ఫార్చూన్‌‌ ఫోర్ సినిమాస్‌‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.