దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు తొమ్మిది అవతారాల్లో పూజలు అందుకుంటున్నారు. బోడుప్పల్ లో ని బంగారు మైసమ్మ మహంకాళేశ్వరస్వామి ఆలయంలో విశేషంగా పూజలు జరుగుతున్నాయి.
రోజూ వివిధ రకాల హోమాలు జరుగుతున్నాయి. అలాగే నిత్యం మహిళలు లలితా సహస్రనా పారాయణంతో పాటు కుంకుమార్చన లు చేస్తున్నారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు విరివిగా వస్తున్నారు. మహిళలు కు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ చైర్మన్బొమ్మక్ శివ చర్యలు తీసుకున్నారు.
గురువారం ( అక్టోబర్ 15)లలితా త్రిపురసుందరీ అవతారంలో భక్తులను ఆశీర్వదించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. దసరా నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా అక్టోబర్ 17న ఆలయ ప్రాంగణంలో చండీయాగం నిర్వహిస్తున్నారు . శమీపూజ, రావణదహనం లాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయని ఆలయ ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.
