Deepika Padukone: నడకమార్గంలో తిరుమల చేరుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకుణే

Deepika Padukone:  నడకమార్గంలో తిరుమల చేరుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకుణే

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణే (Deepika Padukone) తిరుమల శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు. గురువారం (డిసెంబర్ 14న) రాత్రి అలిపిరి కాలిబాట మార్గం గుండా..సామాన్య భక్తులతో పాటు గోవింద నామస్మరణ చేస్తూ..ముడున్నర గంటల పాటు నడుచుకుంటూ తిరుమల కొండకు చేరుకున్నారు. స్టార్ సెలబ్రెటీ హోదాలో ఉన్నప్పటికీ..కాలిబాటన రావడంతో భక్తులు సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.

కాలిబాట అనంతరం తిరుమలలోని రాధేయం అతిధి గృహం చేరుకున్న దీపికా పదుకుణే, ఇవాళ రాత్రి  అక్కడే బస చేసి, శుక్రవారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో, విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకోనున్నారు.

కాగా ప్రస్తుతం దీపికా తెలుగులో ప్రభాస్ కల్కి మూవీతో బిజీగా ఉన్నారు. అలాగే బాలీవుడ్ స్టార్‌ హీరో హృతిక్ రోషన్ ఫైటర్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే దీపికా ఓ హాలీవుడ్‌ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.