బ్రేకప్ అవడం నా అదృష్టం.. పెద్దలు సమక్షంలో ప్రేమ పెళ్లి.. కంగనా షాకింగ్ కామెంట్స్

బ్రేకప్ అవడం నా అదృష్టం.. పెద్దలు సమక్షంలో ప్రేమ పెళ్లి.. కంగనా షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్(Kangana Ranaut) ప్రేమ, పెళ్లి, కుటుంబం పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రానున్న పదేళ్లలో పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆమె.. తన బ్రేకప్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ తేజస్. అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కంగనా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఎలాంటి బంధాలైనా ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రేమ విషయంలో కూడా అంతే. అందులో అందరూ విజయం సాధించలేరు. తెలిసి తెలియని వయసులో నేను కూడా ప్రేమలో పడ్డాను కానీ.. కొన్ని కారణాల వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది. అయితే ఆ బ్రేకప్‌ వల్ల నాకు మంచే జరిగింది. లేకపోతే.. నా సమయం అంతా అక్కడే ఉండాల్సి వచ్చేది. ఇక పెళ్లి గురించి అయితే ప్రతి అమ్మాయి కలలు కంటుంది. కుటుంబ వ్యవస్థపై నాకు గౌరవం ఉంది. నాకు కూడా పెళ్లి చేసుకోవాలని, ఒక ఫ్యామిలీ ఉండాలనే కోరిక ఉంది. రానున్న ఐదేళ్లలో దాని గురించి ఆలోచిస్తా కానీ.. అది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమై ఉండాలి... అంటూ చెప్పుకొచ్చింది కంగనా. 

Also Read :- ఈ చిత్రం నా జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్.. చిరంజీవి స్పెషల్ ట్వీట్