టాలీవుడ్‌లోకి బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ.. హవీష్ సినిమాలో నర్గీస్ ఫక్రీ సెగలు రేపే స్పెషల్ సాంగ్!

టాలీవుడ్‌లోకి బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ.. హవీష్ సినిమాలో నర్గీస్ ఫక్రీ సెగలు రేపే స్పెషల్ సాంగ్!

'నువ్విలా', 'జీనియస్', 'సెవెన్' చిత్రాలతో నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న యంగ్ హీరో హవీష్.. ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకోసమే మాస్ పల్స్ తెలిసిన సూపర్ హిట్ డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో చేతులు కలిపాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న  కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'నేను రెడీ'. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లామరస్ బ్యూటీ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

టాలీవుడ్‌లోకి నర్గీస్ ఫక్రీ!

ఈ సినిమాపై అంచనాలను డబుల్ చేస్తూ మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సినిమాలో ఆమె ఒక స్పెషల్ డాన్స్ నంబర్‌లో మెరవనుంది. లేటెస్ట్ గా విడుదల చేసిన పోస్టర్‌లో నర్గీస్ సిల్వర్ కలర్ మెరిసే దుస్తుల్లో, క్యాండిల్ లైట్ బ్యాక్‌డ్రాప్‌లో సెగలు రేపుతోంది. విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేయనున్నారు.

 

వినోదాల విందు..

'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్', 'ధమాకా' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర చేసిన త్రినాథరావు నక్కిన.. ఈ చిత్రాన్ని కూడా ఫుల్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తున్నారు. ఒక తెలంగాణ అమ్మాయి, ఆంధ్రా అబ్బాయి మధ్య జరిగే లవ్ స్టోరీ చుట్టూ ఈ కథ తిరగనుంది. ఇందులో కామెడీ కింగ్ బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, విటివి గణేష్, గోపరాజు రమణ లాంటి భారీ తారాగణం నటిస్తుండటంతో నవ్వుల విందు గ్యారెంటీ అనిపిస్తోంది. విక్రాంత్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు.

రిలీజ్‌కు సర్వం సిద్ధం!

ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్, రీ-రికార్డింగ్ పనులను కూడా పూర్తి చేసుకుంది. మెలోడీ బ్రహ్మ మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందించారు. నిజార్ షాఫీ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇవ్వనున్నాయి. వచ్చేవారమే గ్రాండ్‌గా ఆడియో లాంచ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్, జూన్ రెండో వారంలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రేజీ కమర్షియల్ ప్యాకేజీ హవీష్ కెరీర్‌కు మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.