డబ్బు కోసం అలా చేయాలంటే భయమేస్తోంది: ఆలియా భట్

డబ్బు కోసం అలా చేయాలంటే భయమేస్తోంది: ఆలియా భట్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhat) షాకింగ్ కామెంట్స్ చేశారు. నటిగా ఒక మంచి పేరు, స్థాయికి వచ్చిన తరువాత డబ్బు కోసం ఎలాబడితే అలా సినిమాలు చేయాలంటే భయంగా ఉందన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో ఆలియా మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో నేను అందుకున్న అవార్డులు నాపై బాధ్యతను పెంచుతున్నాయి. నటి అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి కానీ.. చేసిన ప్రతి పాత్రకు అవార్డు రావడం కష్టం. వచ్చిన అవార్డులు మాత్రం ఇంకా మంచి పాత్రలు చేయాలని గుర్తుచేస్తూ ఉంటాయి. ప్రతిసారి సినిమాలో, ప్రతీ పాత్రలో అద్భుతమైన నటన కనబరచడం అంత ఈజీ కాదు. అందుకే.. డబ్బుల కోసం కమర్షియల్ పాత్రల్లో నటించాలంటే భయంగా ఉంటుంది. ఈ సినిమాలో అలా చేసిన ఆలియా.. ఇలా చేస్తుందేంటి అని కామెంట్స్ చేస్తారు.

ఇక ఈ మధ్యే జాతీయ ఉత్తమనటి అవార్డు అందుకున్నాను. తరువాత తెలిసింది ఆ అవార్డు అందుకున్న వారిలో నేనే చిన్నదాన్నని. ఆ విషయం తెలిశాక రణ్‌బీర్‌ నాకు విలువైన బహుమతి ఇచ్చాడు.. అంటూ చెప్పుకొచ్చారు ఆలియా. ప్రస్తుతం ఆలియా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.