Salman Khan : ఆ హాలీవుడ్ సినిమా కోసం సల్మాన్ను వాడేస్తున్నారు

Salman Khan : ఆ హాలీవుడ్ సినిమా కోసం సల్మాన్ను వాడేస్తున్నారు

హాలీవుడ్ సినిమాలకి ఇండియాలోనూ మంచి క్రేజ్ ఉంది. ఎవేంజర్స్,స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ వంటి సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే.. కొన్ని సంవత్సరాల క్రితం హాలీవుడ్ నుండి ఎంత పెద్ద  సినిమా రిలీజ్ అవుతున్నా  పెద్దగా ప్రమోషన్స్ చేసేవారు కాదు. కానీ ఇటీవల ఇండియన్ సినిమాలు కూడా  ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోవడంతో.. ఇండియాలో హాలీవుడ్ సినిమాలను ప్రమోట్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా.. మరో హాలీవుడ్ సినిమా ఇండియాలో రిలీజ్ కు సిద్దంగా ఉంది. మార్వెల్(Marvel) యూనివర్స్ కి చెందిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా మొదటి వాల్యూమ్ 2014 లో రిలీజ్ అయ్యి మంచి విజయన్నే అందుకుంది. ఇక రెండవ పార్ట్ 2017లో రిలీజయ్యింది. ఇక ఇప్పుడు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 రిలీజ్ కాబోతుంది. మే 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇండియాలో కూడా ఈ సినిమాని భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అయితే ఇండియాలో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని వాడేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ కోసం సల్మాన్ తో ఏకంగా ఓ యాడ్ కూడా షూట్ చేశారు. రీసెంట్ గా ఆ యాడ్ ని రిలీజ్ చేశారు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాలోని గ్రూట్ క్యారెక్టర్ లాగా సల్మాన్ కామెడీ చేస్తున్నట్టు ఈ యాడ్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా కోసం సల్మాన్ చేసిన ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇండియాలోని మార్వెల్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా సల్మాన్ యాడ్ తో ఈ సినిమాపై ఇండియాలో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మార్వెల్ స్టూడియోస్ “గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3” మే 5న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషలలో రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా ఇండియాలో ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.