తండ్రిని కావాలని ఉంది.. కానీ మన చట్టాలు ఒప్పుకోవేమో?

తండ్రిని కావాలని ఉంది.. కానీ మన చట్టాలు ఒప్పుకోవేమో?

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సల్మాన్ ఖాన్ కి తండ్రి కావాలని ఉందట. కానీ దానికి మన చట్టాలు ఒప్పుకోవు అంటూ క్రేజీ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా ఓ నేషనల్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సల్మాన్.. పిల్లల కోసం ప్లాన్ చేయడం గురించి ఆయన మాట్లాడాడు.

"ఏం చెప్పాలి.. మా ఇంటికి కోడలిని తీసుకురావడం గురించి కాదు, పిల్లల కోసం ప్లాన్ చేయాలని వుంది. కానీ మన భారతీయ చట్టాల ప్రకారం అది సాధ్యం కాదు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం"  అన్నారు. అంతేకాదు.. సరోగసీ ద్వారా కరణ్ జోహార్ ఇద్దరు పిల్లలకు తండ్రి కావడంపై కూడా స్పందించాడు సల్మాన్. "అదే నేనూ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఆ చట్టం మారిపోయి ఉండొచ్చు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కాకపొతే పిల్లలు వస్తే వాళ్ల అమ్మ కూడా రావాలి. పిల్లలకు తల్లి అవసరం ఉంటుంది. మన ఇంట్లో చాలా మంది తల్లులు ఉన్నారు. వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి నాకు గ్రామం మొత్తం ఉంది" అని నవ్వుతూ చెప్పుకొచ్చారు సల్మాన్. పెళ్లి కాకుండా తండ్రి  కావాలనుకుంటున్న సల్లు భాయ్ కోరిక తీరుతుందా? చూడాలి మరి.