బూట్‌‌ కట్ బాలరాజు .. టైటిల్‌‌ సాంగ్‌‌ను రిలీజ్

బూట్‌‌ కట్ బాలరాజు .. టైటిల్‌‌ సాంగ్‌‌ను రిలీజ్

సయ్యద్ సోహెల్, మేఘ లేఖ జంటగా శ్రీ కోనేటి దర్శకత్వంలో  ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం ‘బూట్‌‌ కట్ బాలరాజు’.  సునీల్,  సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ టైటిల్‌‌ను సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ‘రింగు రింగు బిళ్ళ’ అంటూ సాగే పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయగా, దేవ్ పవార్ క్యాచీ లిరిక్స్ రాశాడు. 

భోలే షావలి, రఘురాం పాడారు. ‘బూటు బూటు బూట్ కట్ బాలరాజు..  అరె నన్ను చూసే వాడు లేకపోయినా ఫోజు కొడతారోయ్.. జాకీ పెట్టి నన్ను నేను లేపుకుంటారో..’ అంటూ బూట్‌‌ కట్ బాలరాజుగా సోహెల్ చేసిన పాత్రను పరిచయం చేశారు.  ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటలో  సోహెల్ చేసిన మాస్ మూమెంట్స్‌‌ ఆకట్టుకున్నాయి.