ఓటీటీలో ఊరమాస్ స్కంద.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఓటీటీలో ఊరమాస్ స్కంద.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఉస్తాద్ రామ్‌(Ustaad Ram), మాస్ డైరెక్టర్ బోయపాటి (Boyapati) కాంబినేషన్‌లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ స్కంద (Skandha). సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ నెల (అక్టోబరు 27) నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney plus Hotstar) లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మూవీ తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లో రిలీజైన మాస్ ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదని టాక్ వినిపించింది. మరి ఓటీటీలో అయిన అలరిస్తుందో..లేదో చూడాలి మరి. 

స్కంద కథ విషయానికి వస్తే.. 

ఆంధ్ర సీఎం (అజయ్ పుర్కర్) కూతుర్ని తెలంగాణ సీఎం (శరత్ లోహితాశ్వ) కొడుకు పెళ్లి పీటలమీద ఉండగానే లేపుకొస్తాడు. దీంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తీవ్రమైన వైరం మొదలవుతుంది. రాను రాను ఒకరికొకరు చంపుకునేలా పెరుగుతుంది.అప్పుడు ఆంధ్రా సీఎం ఓ యువ‌కుడిని రంగంలోకి దింపుతాడు. అత‌ను ఎవ్వ‌రినైనా ఎదిరించి అనుకున్న‌ది సాధించే ర‌కం. అలా ఆ యువ‌కుడు భారీ బందోబస్తుని కూడా కాద‌ని తెలంగాణ సీఎం ఇంట్లోకి అడుగు పెట్టాడా? ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల కూతుళ్ల‌నీ కిడ్నాప్ చేసి రుద్ర‌రాజ‌పురం తీసుకెళ్లిన యువ‌కుడు (రామ్‌) ఎవ‌రు? 

ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటించగా..శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు.