మెగా స్టార్ సినిమాలో బ్రిట్నీ స్పియర్స్‌ పాట

మెగా స్టార్ సినిమాలో బ్రిట్నీ స్పియర్స్‌ పాట

‘నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా’ అనే పల్లవికి పర్ఫెక్ట్ యాప్ట్   బ్రిట్నీ స్పియర్స్. పాప్ ప్రపంచంలో తనో సెన్సేషన్. ఇరవై మూడేళ్ల క్రితం ‘వన్‌‌ మోర్‌‌‌‌ టైమ్’ ఆల్బమ్‌‌తో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న బ్రిట్నీ.. క్రాస్‌‌ రోడ్స్, ఇన్ ద జోన్, బ్లాక్‌‌ అవుట్, సర్కస్, ఉమనైజర్ లాంటి ఎన్నో హిట్ ఆల్బమ్స్‌‌తో సంగీత ప్రపంచంలో రికార్డులు నెలకొల్పింది.

ప్రిన్సెస్‌‌ ఆఫ్ పాప్‌‌గా వరల్డ్‌‌ వైడ్‌‌ క్రేజ్‌‌ ఉన్న ఈ అమెరికన్‌‌ పాప్‌‌స్టార్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా మెగాస్టార్ మూవీతో. చిరంజీవి హీరోగా ‘గాడ్‌‌ ఫాదర్‌‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు మోహన్‌‌ రాజా. మలయాళంలో మెప్పించిన ‘లూసిఫర్‌‌‌‌’కి ఇది రీమేక్. ఇందులో సల్మాన్‌‌ ఖాన్ ఓ కీలక పాత్ర పోషించబోతు న్నాడు. చిరంజీవి, సల్మాన్ కలిసి ఓ పాటలో డ్యాన్స్‌‌ కూడా చేయబోతున్నారట. ఈ సాంగ్‌‌ని  గ్రాండ్‌‌గా ప్లాన్ చేస్తున్న మేకర్స్,  బ్రిట్నీ స్పియర్స్‌‌తో ఆ పాట పాడించనున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేశాడు తమన్. ఇంటర్నేషనల్‌‌ ఆడియో కంపెనీస్‌‌ ద్వారా ఆమెను కాంటాక్ట్ అవుతున్నామని చెప్పాడు. అయితే బ్రిట్నీతో తెలుగులో పాడించాలా లేక ఇంగ్లిష్‌‌లో పాడించాలా అనేది ఇంకా డిసైడ్ కాలేదని, ఆమెను కలిసే ముందు అది ప్లాన్ చేస్తామని తమన్ అన్నాడు. మొత్తానికి చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్ నటించడమే ఓ విశేషమైతే, పాప్ సెన్సేషన్‌‌ బ్రిట్నీ ఆ పాట పాడటం మరో విశేషం.