బీఆర్ఎస్కు షాక్.. రాజీనామాకు సిద్ధమైన మరో ఎమ్మెల్యే

బీఆర్ఎస్కు షాక్.. రాజీనామాకు సిద్ధమైన మరో ఎమ్మెల్యే

ఎన్నికల ముందు ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కి షాక్ తగిలింది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు బాపురావు ప్రకటించారు. 

మూడు రోజుల(సెప్టెంబర్ 23) క్రితం మంత్రి కేటీఆర్ అపాయింట్‌మెంట్ కావాలని కోరారు రాథోడ్ బాపురావు. దీనికి కేటీఆర్ స్పందించకపోవడంతో.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనకు టికెట్ ఇవ్వకపోవడంతో బాపురావు మనస్థాపానికి గురయ్యారు.

సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రాథోడ్ బాపురావు పేరు లేదు. బోథ్ నుంచి అనిల్ జాదవ్‌కు టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. దీంతో  రాథోడ్ బాపురావు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మారాలంటూ ఆయన మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నారు.

Also Read :- బీఆర్ఎస్ అధిష్టానానికి అసంతృప్తుల తలనొప్పి

మొదట పార్టీని వీడే అంశంపై రాథోడ్ బాపురావు విముఖత వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను వీడబోనని నెల రోజుల క్రితం ఓ ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తనకు మరో పదవి ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.