OTTకి వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ బబుల్ గమ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTTకి వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ బబుల్ గమ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రముఖ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) కొడుకు రోషన్(Roshan) హీరోగా పరిచయమవుతూ చేసిన మూవీ బబుల్ గమ్(Bubble Gum). క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన రవికాంత్ పెరెపు(Ravikanth Perepu) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మానస చౌదరి(Manasa Chaudary) హీరోయిన్ గా నటించింది. అవుట్ అండ్ అవుట్ యూత్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. విడుదలై నెల రోజులు కావస్తున్నా నేపధ్యంలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. 

Also read :- రాజకీయ పార్టీ పెట్టిన హీరో విజయ్ ఆస్తులు ఎంత..!

ఇదే విషయాన్ని బబుల్ గమ్ సినిమా ఓటీటీ హక్కులని సొతం చేసుకున్న ప్రముఖ సంస్థ ఆహా అధికారికంగా ప్రకటించింది. ప్రేమికుల రోజుకు 5 రోజుల ముందు ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో సినీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

ఇక బబుల్ గమ్ సినిమా కథ విషయానికి వస్తే.. ఓల్డ్ సిటీలో మటన్ వ్యాపారి కొడుకు ఆధిత్య. అలాగే ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి ఝాన్సీ. ఈ ఇద్దరి ప్రపంచాలు వేరు. అలాంటి వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ప్రేమను గెలిపించుకోవడానికి అందుకోసం వాళ్ళు ఎం చేశారు? అనేది మిగిలిన కథ.