జూబ్లీహిల్స్లో జీహెచ్ఎంసీ దూకుడు.. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బిల్డింగ్స్ సీజ్

జూబ్లీహిల్స్లో జీహెచ్ఎంసీ దూకుడు.. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బిల్డింగ్స్ సీజ్

జీహెచ్ఎంసీ అధికారులు దూకుడు పెంచారు. అనుమతులు లేకుండా నిర్మి్స్తున్న బిల్డింగ్స్ సీజ్ చేసి షాకిచ్చారు. గురువారం (జూన్ 19) జూబ్లీహిల్స్, షేక్ పేట్ తదితర ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలను టార్గెట్ చేశారు. అందులో భాగంగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రెండు బిల్డింగ్స్ ను సీజ్ చేశారు. 

జూబ్లీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో లేన్ జవహర్ నగర్ లో అక్రమంగా నిర్మిస్తున్న ఐదంతస్తుల భవనాన్ని సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారులు కలిసి అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేశారు. 

అదే విధంగా షేక్ పేట్ ఫాల్కన్ వ్యాలీ లో మూడంతస్తులకు పర్మిషన్ తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఐదంతస్తుల  బిల్డింగ్ ను సీజ్ సీజ్ చేశారు. అక్రమ నిర్మాణంపై గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో.. కమీషనర్ ఆదేశాలతో సీజ్ చేశామని డీసీ సమ్మయ్య తెలిపారు. పర్మిషన్ లేకుండా నిర్మించే అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.