- 2,400 మందికి పైగా అరెస్ట్.. పలు సిటీల్లో కర్ఫ్యూ
- వందల కోట్ల ఆస్తి నష్టం.. భయాందోళనలో సామాన్యులు
- అల్లర్లను అంచనా వేయడంలో విఫలమయ్యాం: మాక్రాన్
పారిస్: పెరుగుతున్న జీవన వ్యయం, పబ్లిక్ సర్వీస్ వ్యవస్థ క్షీణించడంపై ఫ్రాన్స్‌లో చెలరేగిన నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఆదివారం పారిస్, మార్సేయ్, లియాన్ వంటి అనేక ప్రధాన నగరాల్లో వేలాది మంది సామాన్య ప్రజలు, కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి. పోలీసులతో పాటు ప్రభుత్వ భవనా లను టార్గెట్ చేసి నిరసనకారులు దాడులు చేశారు. నిరసనల ముసుగులో చెలరేగిన అల్లర్లు.. ఆస్తులకు నిప్పుపెట్టడం. వేలాది దుకాణాల లూటీకి దారితీశా యి. హింసాత్మక ఘటనలతో పారిస్ వీధులు అగ్ని గుండంగా మారాయి.
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు.. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 2,400 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. నిరసనకారుల దాడుల్లో వందలాది వ్యాపార సంస్థలు, దుకాణాలు, ప్రభుత్వ భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు వెయ్యి మంది భద్రతా సిబ్బంది గాయపడగా... వందల కోట్ల యూరోల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
నిరసనలో హింసను ముందే అంచనా వేయడంలో, తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీసులు విఫ లమైనట్లు ప్రభుత్వమే స్వయంగా అంగీకరించింది. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి, హింసను కట్టడి చేయడానికి కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ప్యూ విధించాలని అధికారులను ప్రధాని సెబాస్టి యన్ లెకార్ను ఆదేశించారు..
హోంమంత్రి రాజీనామా తిరస్కరణ
ఫ్రాన్స్ లో చెలరేగిన హింసాత్మక అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ హోం మినిస్టర్ లారెంట్ నునెజ్ రాజీనామా చేయగా... ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరస్కరించారు. అల్లర్లను ముందే పసి గట్టడంలో ఇంటెలిజెన్స్. భద్రతా యంత్రాంగం కొంతవరకు విఫలమైనప్పటికీ.. ప్రస్తుత సంక్షోభపరిస్థితుల్లో శాంతిభద్రతలను పరిరక్షించడానికి బారెంట్ కీలకమని మాక్రాన్ పేర్కొన్నారు.
జాగ్రత్తగా ఉండండి
ఫ్రాన్స్‌లో హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో పర్యటన కోసం అక్కడికి వెళ్లిన తమ పౌరులకు యూరోపియన్ దేశాలు అడ్వైజరీ జారీ చేశాయి. ఫ్రాన్స్ లో అల్లర్లు మరింత విస్తృతమయ్యే అవకాశం ఉందని, నిరసనలకు, భారీ జనసమూ హాలకు దూరంగా ఉండాలని హెచ్చరించాయి.
గల్ఫ్‌కు మాక్రాన్
ఫ్రాన్స్‌లో తలెత్తిన చమురు సరఫరా అంతరాయాలను నివారించడానికి మాక్రాన్ గల్ఫ్ దేశాల పర్యటన చేపట్టారు. ఈ టూర్లో భాగంగా ఆయన కువైట్, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్ దేశాల్లో పర్యటించి.. అక్కడి అగ్రనేతలతో కీలక చర్చలు జరుపుతారు. తమ దేశానికి అవసరమైన చమురు, డీజిల్ సరఫరాలను భద్రపరచడంతో పాటు, ద్వైపాక్షిక ఆర్థిక, రక్షణ భాగస్వామ్యాలను మరింత పటిష్టం చేసుకోనున్నారు.
