త్రివిక్రమ్ మైథాలజికల్ మూవీ నుంచి బన్నీ ఔట్.. ఎన్టీఆర్తో ఫిక్స్..?

త్రివిక్రమ్ మైథాలజికల్ మూవీ నుంచి బన్నీ ఔట్.. ఎన్టీఆర్తో ఫిక్స్..?

గుంటూరు కారం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. కుటుంబ కథా చిత్రాలతో, తనదైన కామెడీ, ప్రాస, యాసలతో మినిమమ్ గ్యారెంటీ ఇచ్చే త్రివిక్రమ్..ఈసారి మైథాలజీ సబ్జెట్ ను ఎంచుకున్నారు. రామాయణం, మహాభారతం లాగే ఒక సోషియో మైథాలజికల్ ఫాంటసీ మూవీని భారీ ఎత్తున తెరకెక్కించేందుకు స్ర్కిప్ట్ సిద్ధం చేశారు. 

ఈ సినిమా కోసం ముందుగా అల్లు అర్జున్ ను హీరోగా అనుకున్నారు. కానీ లేటెస్ట్ సమాచారం ఏంటంటే.. బన్నీ ప్లేస్ లో ఎన్టీఆర్ ను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు టాక్. ఇది బన్నీతో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కూడా సర్ప్రైజింగ్ న్యూసే. అయితే బన్నీ ప్లేస్ లో ఎన్టీఆర్ ను సెలెక్ట్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఇంకా బయటకు రాలేదు. సోషల్ మీడియాలో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య డిబేట్ మొదలైంది. 

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్ ప్రాజెక్ట్స్ ఉన్నందున ఈ రెండు పూర్తైన తర్వాత త్రివిక్రమ్ తో మూవీ ఉంటుందని ఫిలింనగర్ టాక్. అదే విధంగా త్రివిక్రమ్ కూడా వెంకటేష్, రామ్ చరణ్ తో వరుసగా సినిమాలు చేయనున్నారు. ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ పూర్తయ్యేలోపు త్రివిక్రమ్ ఈ రెండు పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత ఈ సోషియో ఫాంటసీ మూవీ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.