బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్పూర్తితో నిలిచిన ప్రాణాలు.. వీడియో వైరల్

బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్పూర్తితో నిలిచిన ప్రాణాలు.. వీడియో వైరల్

బస్సులో ప్రయాణిస్తున్న మహిళకు సడెన్ గా హార్ట్ అటాక్.. తీవ్రమైన గుండెనొప్పితో విలవిలలాడింది. కూర్చున్న సీటులోనే  కుప్పకూలింది. ప్రయాణికులంతా ఏం చేయాల తోచక ఆందోళన చెందుతున్న సమయంలో డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించి ఆమె ప్రాణాలు కాపాడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.ప్రయాణికులను గమ్యానికి చేర్చడం మాత్రమే కాదు..అవసరమైతే వారి ప్రాణాలను కాపాడటం కూడా బాధ్యతేనని నిరూపించాడు ఆ డ్రైవర్. కర్నాటకలో తుమకూరు, మధుగిరి మధ్య ప్రయాణిస్తున్న ఓ ఆర్టీసీ  బస్సులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.  డ్రైవర్  సమయస్పూర్తి, మానవత్వాన్ని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

కర్నాటక ఆర్టీసీకి చెందిన  బస్సు.. తుమకూరునుంచి మధుగిరి కి వెళ్తుండగా ఈ ఘటన  జరిగింది.  బస్సు రన్నింగ్ లో ఉండగా అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు  సడెన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. నొప్పితో విలవిలలాడుతోంది. పరిస్థితిని గమనించిన బస్సు డ్రైవర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమీప ఆసుపత్రికి బస్సును తీసుకెళ్లాడు. ప్రయాణికుల సహకారంతో మహిళను వెంటనే వైద్యుల దగ్గర చేర్చారు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.

ఈ ఘటనకు సంబంధించిన వైరల్ అవుతున్న వీడియోలో.. మధుగిరి లోని ఓ ఆస్పత్రి ముందు ఆర్టీసీ బస్సు ఆగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అందులోంచి ప్రయాణికులు హడావుడిగా దిగి ఆస్పత్రిలోకి పరుగులు పెట్టారు. డ్రైవర్, ప్రయాణికులు  మహిళను స్ట్రెక్చర్ పై ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. డాక్టర్లు సకాలంలో ఆ మహిళకు చికిత్స అందించడంతో  ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంది.  డ్రైవర్ సమయస్పూర్తి, మానవత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. 

►ALSO READ | పామాయిల్, నూనెతో నకిలీ పనీర్ తయారీ.. మహారాష్ట్రలో బ్యాన్.. ఉల్లంఘిస్తే లక్ష జరిమానాతో 6 నెలలు జైలు శిక్ష !

నెటిజన్లు స్పందిస్తూ.. ఇలాంటి వారే నిజమైన హీరోలు అనిడ్రైవర్ ను ప్రశంసించారు. డ్రైవర్ చూపిన సమయస్పూర్తి, మానవత్వం ఎంతో ప్రశంసనీయం.. తన విధి కేవలం బస్సు నడపడం మాత్రమే కాదని, ప్రయాణికుల ప్రాణ భద్రత కూడా తన బాధ్యతేనని నిరూపించారు.. ఇలాంటి సందర్భాల్లో క్షణాల ఆలస్యం కూడా ప్రాణాలకు ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది.. ఒత్తిడిలోనూ డ్రైవర్ తీసుకున్న నిర్ణయం ఒక విలువైన ప్రాణాన్ని కాపాడిందని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు.