మహారాష్ట్రలో లాక్ డౌన్ సడలింపులు లేవు: ఉద్ధవ్ థాక్రే

మహారాష్ట్రలో లాక్ డౌన్ సడలింపులు లేవు: ఉద్ధవ్ థాక్రే

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజు రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నిబంధనల సడలింపునకు అంగీకరించడం లేదు. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదౌతున్న ఈ సమయంలో లాక్ డౌన్ నిబంధనలను సడలించబోమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. లాక్ డౌన్ కారణంగా కరోనాను కట్టడి చేయగలుగుతున్నా… లింక్ ను తెగ్గొటడం సాధ్యం కావడం లేదన్నారు. రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనల సడలింపు అంశాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలివేయడంతో ఉధ్ధవ్ థాక్రే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.