Good Food: క్యాన్సర్ చెక్.. ఎలాంటి ఆహారం తినాలి... ఏమేమి తినకూడదు.. ప్రపంచ క్యాన్సర్ రీసెర్చి ఫౌండేషన్ స్టడీ

Good Food:  క్యాన్సర్ చెక్.. ఎలాంటి ఆహారం తినాలి... ఏమేమి తినకూడదు..  ప్రపంచ క్యాన్సర్ రీసెర్చి ఫౌండేషన్ స్టడీ

తినే ఫుడ్, క్యాన్సర్​ కు  సంబంధం ఉందనేది నిజం. కొన్ని రకాల ఫుడ్ తీసుకునే వాళ్లు, కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. అలాగే ఇంకొన్ని రకాల ఫుడ్ తీసుకునే వాళ్లు క్యాన్సర్ బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటోంది. దీన్నిబట్టి క్యాన్సర్ రావడానికి ఫుడ్ కూడా ఒక కారణమని సైంటిస్టులు అంటున్నారు. 

క్యాన్సర్ రావొద్దంటే అన్నీ సమపాళ్లలో ఉండే హెల్దీ ఫుడ్ తీసుకోవడం మంచిదంటున్నారు. అయితే, క్యాన్సర్ హిస్టరీ ఉన్న కుటుంబ సభ్యులు రెగ్యులర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్లు, క్యాన్సర్ కలిగించే బ్యాడ్ హ్యాబిట్స్ లాంగ్ టైమ్ నుంచి ఉన్నవాళ్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా క్యాన్సర్​ కు  దారితీసే ఫుడ్ విషయంలో మరింత జాగ్రత్త పడాలి.  ఇప్పుడు ఆ జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..!

లావు తగ్గాలే

బాడీ మాస్ ఇండెక్స్ (మన శరీరం ఎత్తు బరువుల నిష్పత్తి) ఎక్కువయ్యే కొద్దీ కొన్ని రకాల క్యాన్సరు వస్తాయి. ఉండాల్సిన బరువుకంటే 15 కేజీలు అంతకంటే ఎక్కువుంటే క్యాన్సర్ రిస్క్ పదిశాతం ఎక్కువ ఉంటుంది. 50 లక్షల మంది ప్రజల మీద సైంటిస్టులు స్టడీ చేసి, బాడీ వెయిట్ పెరుగుతూ ఉంటే పేగులు, పిత్తాశయం, కిడ్నీలు, లివర్​ లో  క్యాన్సర్ వచ్చే ప్రమాదం 10శాతం ఉన్నట్లుగా తేల్చారు.

 శరీరంలో ఎక్కువయ్యే కొవ్వు కారణంగా హార్మోన్లు, ఇన్ఫ్లమేటరీ ప్రొటీన్స్ ఎక్కువగా తయారైతే కణుతులు ఏర్పడుతాయి. బరువు పెరుగుతున్న కొద్దీ బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని క్యాన్సర్ ఫౌండేషన్ స్టడీస్ చెబుతున్నాయి. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) సాధారణ (18.5 నుంచి 25 మధ్యలో) స్థాయిలో ఉండే వాళ్లలో క్యాన్సర్ రిస్క్ తక్కువగా ఉందని తేలింది.

హెల్దీ ఫ్యూచర్ ప్లాన్

పర్యావరణాన్ని, జన్యు మార్పుల్ని మార్చలేం. కానీ ఫుడ్ హాబిట్ ని మార్చుకోగలం. క్యాన్సర్స్ లో 70 శాతం మనం కంట్రోల్ చేసుకునేవే. కాబట్టి హెల్దీ డైట్ లైఫ్ ఇంపార్టెంట్. అన్​హెల్దీ ఫుడ్ హాబిట్స్ వల్లే 30 నుంచి 40 శాతం క్యాన్సర్ కేసులు ఉం టున్నయ్. కాబట్టి వెయిట్ మెయింటెనెన్స్, ఫుడ్ హాబిట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసుకోవడం, అలవాటు చేసుకోవడం, తినకూడని వాటిని పక్కనపెట్టడం చేస్తే క్యాన్సర్ వస్తుందనే భయమే ఉండని నిపుణులు చెబుతున్నారు.

 ప్రపంచ క్యాన్సర్ రీసెర్చి ఫౌండేషన్ స్టడీలో ఎలాంటి ఫుడ్ తినే అలవాట్లు ఎక్కువగా ఉన్న వాళ్లకు ఏ క్యాన్సర్ వస్తోంది? ఏ ఫుడ్ తినే కమ్యూనిటీల్లో క్యాన్సర్ రేట్ తక్కువగా ఉందో గుర్తించారు. 

 ఫుడ్ హాబిట్స్ ఇలా ఉండాలి.

  •  ఫైబర్ (పీచు) ఎక్కువగా ఉండే ఫుడ్ తినాలి.
  • రెగ్యులర్ మెనూలో ఫైబర్ కచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
  • ఫుడ్ క్వాలిటీ గురించి అందరూ ఆలోచిస్తున్నారు. కానీ, బ్యాలెన్స్ డైట్ మీద శ్రద్ధ తగ్గుతోంది. రెంటికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
  • మీల్స్ లో మూడు వంతుల ఫుడ్ మొక్కల నుంచి వచ్చినది (అన్నం.. కూరలు, పప్పులు, చపాతీ, జామ లాంటివి), ఒక వంతు మాంసం, యానిమల్ ఫ్యాట్, ప్రొటీన్ రిచ్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి.
  • ప్రాసెస్ చేయని (పై పొరలు పూర్తిగా తీసేయని) మిల్లెట్స్, ముడి బియ్యం, కూరగాయలు, ఫ్రూట్ రెగ్యులర్ గా తీసుకుంటే హెల్దీగా ఉంటారు. క్యాన్సర్ రిస్క్ తక్కువ.
  • తక్కువ తక్కువగా తవాలి. ఒక రోజులో వీలుని బట్టి 5 నుంచి 9 సార్లు ఫుడ్​ తినాలి
  • రోజూ ఫ్రూట్ తినాలి. సీజనల్ ప్రూట్ తింటే మంచిది.
  • బీఫ్, పోర్క్ కి బదులుగా చేపలు, కోళ్లు, బాతులు, గుడ్లు తినాలి.
  •  ప్రతి మీల్స్ లో మిల్లెట్స్, బీన్స్, బఠాణీలు ఉండేలా చూసుకోవాలి.
  • గ్రీన్, ఆరెంజ్ కలర్స్ కూరగాయలు ఎక్కువగా తినాలి.

ఇలాంటి ఫుడ్​ అస్సలు తినకూడదు

  • కొవ్వు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి.
  •  రెడ్ మీట్​ని రెగ్యులర్ తీసుకోవద్దు.
  • వీలయినంత వరకు యానిమల్ ఫ్యాట్ తగ్గించాలి. వెజిటబుల్ ఫ్యాట్​తో ప్రమాదం లేదు.
  • కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ మానేయాలి.
  • పాలిష్ చేసిన బియ్యంతో వండిన అన్నం తినొద్దు.
  • మాడిన, నిప్పులు, మంటపై కాల్చిన, పొగ చూరిన ఫుడ్ తినకూడదు.
  • ఆల్కహాల్ వల్ల నోరు, పేగు, బ్రెస్ట్, స్వరపేటిక, కాలేయ క్యాన్సర్లు వస్తాయి.
  • ఆల్కహాల్ తీసుకునేవాళ్లు స్మోకింగ్ చేస్తే క్యాన్సర్ రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది.