జ్యోతిష్యం: కర్కాటక రాశిలో మహాలక్ష్మి రాజయోగం.. ఆరు రాశుల వారికి ఆషాఢ మాసంలో లక్కే లక్కు..!

జ్యోతిష్యం:  కర్కాటక రాశిలో మహాలక్ష్మి రాజయోగం.. ఆరు రాశుల వారికి  ఆషాఢ మాసంలో లక్కే లక్కు..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశిలో గురుడు .. సూర్యుడు కలిసి ఆగస్టు 16 వరకు సంచారం చేస్తాయి.  సంచారం చేయడం వలన .  ఆషాఢ మాసంలో  రెండు పవర్​ పుల్​ గ్రహాలు కలవడం వలన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  దీని వలన ఆరు రాశుల వారికి  ఆర్థిక స్థితిలో మంచి పెరుగుదల, వృత్తిలో పురోగతి కూడా కలుగుతాయి. ఇప్పుడు  ఆరాశుల గురించి తెలుసుకుందాం. . .! 

మేష రాశి  :  ఈ రాశి నాలుగవ ఇంట్లో  రెండు పవర్​ పుల్​ గ్రహాలు కలయిక వలన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడటంతో .. ఈ రాశి వారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు.  విలాసవంతమైన జీవితంతో పాటు ఆర్థికంగా లాభం వచ్చే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు పురోగతి సాధించడంతో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది.  గతంలో వివిధ కారణాల వలన ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది.  వ్యాపారస్తులు.. కాంట్రాక్టర్లు మంచి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి జాబ్​ ఆఫర్​ లు వచ్చే అవకాశం ఉంది.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. 

మిథున రాశి :  ఈ రాశి రెండో ఇంట్లో గురుడు.. సూర్యుడు కలిసి సంచారం చేయడం వలన చాలా మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థికంగా పురోభివృద్ది ఉంటేంది.   కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. వారసత్వ ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమై మంచి ఫలితాలు లభిస్తాయి. చాలా కాలంగా పూర్తికాని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు.  గత పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు అందుకుంటారు.  నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.  పెళ్లి సంబంధాలు చూసే వారికి బంధు వర్గంలోని వారితో నిశ్చయమ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. 

కర్కాటక రాశి:  ఆషాఢ మాసంలో గురు .. సూర్యుడు కలిసి సంచారం వలన ఈ రాశి వారికి జీవితంలో అనేక సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది.  సమాజంలో కీర్తీ, ప్రతిష్ఠలు,, గౌరవం పెరుగుతాయి.ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే కోరిక ఉంటే, అది నెరవేరుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఉద్దేశం ఉంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

ధనస్సురాశి:  మహాలక్ష్మి రాజయోగం వలన ఈ రాశి వారికి సమాజంలో కీర్తి.. గౌరవం.. ప్రతిష్ఠ పెరుగుతుంది. కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడంతో .. ఇబ్బందులు తీరుతాయి.  కొన్ని కొత్త వనరులు ఏర్పడుతాయి.  కొత్త ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలు.. కొత్త ప్రణాళికలు కలసి వస్తాయి.  ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు పుష్కలంగా ఉంటుంది.  ప్రమోషన్ రావడం.. వేతనం పెరగడం ... కొన్ని కొత్త బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది.  వ్యాపారస్తులకు అన్ని విధాల కలసి వస్తుంది.  అనుకోకుండా  పెట్టుబడులు పెట్టే వారు ఊహించని లాభాలు పొందుతారు.  

వృశ్చిక  రాశి: ఆషాఢ మాసంలో సూర్యుడు.. గురుడు కలవడం వలన ఏర్పడే మహాలక్ష్మి రాజయోగం వలన  ఈ రాశి వారు అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.  ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.  బుధాదిత్యయోగం వలన ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. జాయింట్ వ్యాపారాలు కలసివస్తాయి.  ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది.  అధికారుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి  రావడంతో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది.  పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. చేతి వృత్తుల వారికి అధికంగా ఆర్డర్లు రావడంతో కష్టాలు తీరతాయని పండితులు చెబుతున్నారు. 

మకరరాశి  : జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం...  మహాలక్ష్మీ రాజయోగం  వలన  ఈ రాశి వారు ఆర్థికంగా బలపడతారు.  వృత్తి.. ఉద్యోగం.. వ్యాపారంలో  పురోగతి ఉంటుంది.  ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.   కొత్త ఆదాయ మార్గాలు అనుకోకుండా ఏర్పడటంతో సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడటం వలన వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది.   పెళ్లి.. ప్రేమ విషయంలో మొదట్లో కొన్ని అవాంతరాలు ఏర్పడినా... చివరికి మీరు అనుకున్నదే జరుగుతుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.