పరాభవనామ సంవత్సరం ( 2026) సెప్టెంబర్ నెలలో శని మీన రాశిలో వక్రగతిలో, రాహువు కుంభంలో, కేతువు సింహ రాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహాల సంచారం.. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారంగా ఈ రాశి వారికి కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. ఆదాయం అంచెలంచెలుగా పెరుగుతుంది కర్కాటకరాశి వారికి ఈనెలలో ఎలా ఉంటుందో సవివరంగా తెలుసుకుందాం. . .!
సెప్టెంబర్ నెల (2026) గ్రహాల మార్పు వివరాలు ..
- సెప్టెంబర్ 2: తులా రాశిలోకి శుక్రుడు
- సెప్టెంబర్ 7: కన్యారాశిలోకి బుధుడు
- సెప్టెంబర్ 17: కన్యారాశిలోకి సూర్యుడు
- సెప్టెంబర్ 18: కర్కాటక రాశిలోకి కుజుడు
- సెప్టెంబర్ 26: తులా రాశిలోకి బుధుడు
కర్కాటకరాశి వారికి ఈ నెలంతా ( సెప్టెంబర్) అద్భుతంగా సాగిపోతుందని పండితులు చెబుతున్నారు. చిన్న చిన్న విషయాలను ఆలోచించి మనస్సు పాడు చేసుకోవద్దు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలా కలిసి వస్తుంది.
వ్యాపారపరంగా కొన్ని హెచ్చుతగ్గులు ఎదురైనప్పటికీ.. చివరి 15 రోజులు లాభాలు అధికంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. వ్యాపారంలో వృద్ధి కనపడే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అయితే 19, 20, 21 తేదీలలో ఆందోళన ఎదుర్కొనవలసి వస్తుంది.
శుక్రుడి శుభ దృష్టి వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చుని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు ఆందోళన కలిగే అవకాశం ఉంది.వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్య సిద్ధి, వ్యవహార జయం వంటివి జరుగుతాయి. వ్యాపారస్తులకు పాత పెట్టుబడులకు ఈ సమయంలో ఊహించని లాభాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు తగ్గడంతో చాలా ప్రశాంతంగా ఉంటారు.
అయితే నష్టదాయకమైన వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఆర్థిక బాధ్యతలను ఇతరులకు అప్పగించకుండా స్వయంగా పర్యవేక్షించడం అవసరం. సొంత పనులపై మరింత శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.ఆరోగ్యపరంగా ఆహార, విహార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనవసర ప్రయాణాలు, అజాగ్రత్తలకు దూరంగా ఉండటం మంచిది.
కుటుంబ జీవితం సాధారణంగా ప్రశాంతంగా సాగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. కెరీర్ విషయంలో ఊహించని మార్పులు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది..
పరిహారాలు: ప్రదోష కాలంలో శివాలయ దర్శనం.. ప్రతి మంగళవారం సుందరాకాండ పారాయణం, హనుమంతునికి ఆకుపూజ
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
