ఏడూళ్ల ఎల్లలు దాటి.. కెప్టెన్ మిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెకెండ్ సాంగ్ రిలీజ్

ఏడూళ్ల ఎల్లలు దాటి.. కెప్టెన్ మిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెకెండ్ సాంగ్ రిలీజ్

ధనుష్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాడు. ప్రియాంక అరుళ్ మోహన్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించగా, కన్నడ స్టార్ శివ రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేసిన టీమ్, మంగళవారం సెకెండ్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘ఘోర హర’ అంటూ సాగిన పాటలో ధనుష్, శివ రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్ డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ లుక్స్‌‌‌‌‌‌‌‌లో కనిపించారు. 

జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన పాటను రాహుల్ సిప్లిగంజ్ హై ఎనర్జీతో పాడాడు. ‘మండే మార్తాండం మల్లె.. ఘోర హర.. మద గజమై వచ్చాడు..  ఘోర హర.. ఏడూళ్ల ఎల్లలు దాటి.. ఘోర హర.. వెలుగు పంచినాడయ్యో.. ఘోర హర’ అంటూ రాకేందు మౌళి పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ లిరిక్స్ రాశాడు. 1930–40 బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సాగే సినిమా కావడంతో అప్పటి విలేజ్ లొకేషన్స్‌‌‌‌‌‌‌‌లో సాంగ్ షూట్ చేశారు.  టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో  నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.