కంప్లయింట్ ఇచ్చిన మహిళపై కానిస్టేబుల్ వేధింపులు

కంప్లయింట్ ఇచ్చిన మహిళపై కానిస్టేబుల్ వేధింపులు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: మహిళను వేధించిన కానిస్టేబుల్ పై కేసు నమోదైంది . సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సత్యనారాయణ కానిస్టేబుల్ గా చేస్తున్నాడు. కుటుంబ సమస్యతో ఠాణాకు వచ్చిన మహిళ సెల్ నెంబర్ తీసుకుని, రోజు ఫోన్ చేస్తూ ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆమె ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు సిరిసిల్ల పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.