సందీప్ కిషన్ హీరోగా ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘కరికాల’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్‌కు జంటగా ముగ్గురు హీరోయిన్స్ నటించనుండగా, ఇటీవల కేథరిన్ థ్రెసా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
మరో హీరోయిన్గా సాక్షి మడోల్కర్ నటించబోతున్నట్టు తెలియజేస్తూ తన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. గత ఏడాది ‘మోగ్లీ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సాక్షికి తెలుగులో ఇది రెండో సినిమా. శ్రీచరణ్ పాకాల దీనికి సంగీతం అందిస్తున్నాడు.
అక్టోబర్ 15న ఈ పాన్ ఇండియా మూవీ ప్రారంభం కానుంది. రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌ను వచ్చే ఏడాది జులై 2న, రెండో భాగాన్ని అదే ఏడాది అక్టోబర్ 28న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
