మే 4 నుంచి జూన్ 11 వరకు CBSC 10,12 పరీక్షలు

మే 4 నుంచి జూన్ 11 వరకు CBSC 10,12 పరీక్షలు

CBSC 10,12 తరగతుల పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ. మే 4 నుంచి జూన్ 11వరకు పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర విద్యశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మే 4నుంచి జూన్ 7 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనున్నాయి.

మే 4నుంచి జూన్ 11 వరకు జరిగే 12వ తరగతి పరీక్షలు రెండు షిప్టుల్లో జరపనున్నారు. ఫస్ట్ షిప్ట్ ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు…సెకండ్ షిప్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరగనున్నాయి. మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించి… జులై 15 నాటికి రిజల్ట్స్  విడుదల చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.