పుట్టినరోజున బావను విష్ చేసిన బన్నీ

పుట్టినరోజున బావను విష్ చేసిన బన్నీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకంక్షాలు తెలుపుతున్నారు.ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి.. "మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఎన్టీఆర్ కు నా జన్మదిన శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా హ్యాపీ బర్త్ డే బావ అంటూ పోస్ట్ చేశాడు. ఇక.. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఉస్తాద్ హీరో రామ్ పోతినేని, మంచు మనోజ్, టాలెంటెడ్ బ్యూటీ రాశీ ఖన్నా, డైరెక్టర్స్ బుచ్చిబాబు సనా, బాబీ కొల్లి.. ఇలా చాల మంది స్టార్ సెలబ్రెటీస్ తారక్ కు సోషల్ మీడియాలో వేధికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.