హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్‌ప్లాంట్‌కు అవసరమైన జీ9 బొగ్గు సప్లైకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. ఏటా సుమారు 8 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరాకు కోలిండియా నుంచి అనుమతులు వచ్చాయి. 2 రోజుల్లో ఒప్పందం చేసుకోవడానికి రాష్ట్ర జెన్కో ఆఫీసర్లు కోల్‌కతా వెళ్లనున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు మొదటి నుంచీ బొగ్గు సమస్యలొస్తున్నాయి. మొత్తం 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్నిర్మించారు.
రెండేళ్ల కింద ఇక్కడ 800 మెగావాట్ల సామర్థ్యం గల మొదటి యూనిట్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అన్నీ యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం.. అన్ని యూనిట్లకు కలిపి ఏటా 14 మిలియన్‌టన్నుల అధిక నాణ్యత గల జీ9 బొగ్గును సింగరేణి అందించాల్సి ఉంది. రాష్ట్రంలో బొగ్గు గనులు మూతపడటం, కొత్త గనుల రాకపోవడంతో సింగరేణి క్వాలిటీ బొగ్గును సప్లై చేయలేకపోతోంది. దీనివల్ల ఆయా యూనిట్లు తక్కువ సామర్థ్యంతో నడుస్తున్నాయి.
ఇది కాస్తా విద్యుత్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పై ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం 3 యూనిట్లకు మాత్రమే బొగ్గు సరఫరా చేస్తామని సింగరేణి జెన్ కోకు తెలిపింది. దీంతో ఆ సంస్థ మిగతా2యూనిట్ల బొగ్గు అవసరాల కోసం కోలిండియాతో సంప్రదింపులు జరిపింది. కేంద్ర బొగ్గు గనుల శాఖకు జెన్కో సీఎండీ హరీశ్ లేఖ రాశారు. దీంతో కోలిండియా ప్రతినిథులు ఇటీవల రాష్ట్రానికి వచ్చి, జెన్కో అధికారులతో చర్చలు జరిపారు. రాష్ట్ర విద్యుత్అవసరాలరీత్యా జీ9 బొగ్గు సరఫరాకు కేంద్రం నుంచి గ్రీన్సిగ్నల్రావడంతో యాదాద్రి ప్లాంట్బొగ్గు ఇబ్బందులు ఇక తీరినట్లేనని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు.
మహానది బొగ్గు గని నుంచి సప్లయ్
కేంద్ర బొగ్గు శాఖ ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్ర జెన్కో అధికారులు అగ్రిమెంట్చేసుకునేందుకు కోల్‌కతా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. జెన్కో సీఎండీ హరీశ్‌తోపాటు పలువురు డైరెక్టర్లు, చీఫ్ఇంజినీర్ల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోలిండియాతో ఒప్పందం జరిగిన వెంటనే ఒడిశాలోని మహానది బొగ్గు గని నుంచి బొగ్గు సరఫరా మొదలుకానుంది. ఏటా 8 మిలియన్‌టన్నుల జీ9 బొగ్గు సప్లై జరిగితే వైటీపీఎస్ ప్లాంట్‌లో వంద శాతం విద్యుత్ఉత్పత్తికి అవకాశాలు మెండుగా ఉన్నాయని జెన్కో ఇంజినీర్లు చెబుతున్నారు.
