ఆధార్‌ అప్‌డేట్‌ పై కేంద్రం కొత్త నిబంధనలు

ఆధార్‌ అప్‌డేట్‌ పై కేంద్రం కొత్త నిబంధనలు

ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు జరిగాయి. అయితే వాటిని మార్చుకునే విషయంలో  కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. పేరు, పుట్టినరోజు తేదీలు, ఇతర తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు ఇప్పటివరకు ఎలాంటి పరిమితి లేదు. ఎవరు…ఎన్నిసార్లైనా అప్ డేట్ చేసుకునే వీలుండేది.

ఆధార్‌ అప్‌డేట్‌ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మార్పులు చేర్పులపై కొత్తగా నిబంధనలు తీసుకొచ్చింది భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (ఉడాయ్). కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఆధార్‌లో పుట్టినతేదీని కేవలం ఒక్కసారి మాత్రమే మార్చుకునేందుకు వీలుంటుంది. ముఖ్యంగా పేరు, పుట్టినతేదీని మార్పులు చేర్పులకు పరిమితులు విధించింది.

ఒకవేళ సూచించిన దానికంటే కంటే ఎక్కువసార్లు మార్పులు చేసుకోవాల్సి వస్తే సమీప ఆధార్ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి అధికారులకు తగిన కారణాలు వివరించాలి. మార్పులు చేర్పులకు సంబంధించిన ఆధారాలను పోస్టు ద్వారా, ఈ మెయిల్ ద్వారా అధికారులకు పంపాల్సి ఉంటుంది.