హైదరాబాద్ వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రెండో ఫేజ్ లో భాగంగా 76 కిలోమీటర్ల మెట్రో లైన్ కు రూ.24 వేల 269 కోట్ల నిధులు విడుదల చేసింది కేంద్రం.ఈ ప్రాజెక్టులో మొత్తం 5 కారిడార్లు, 76 కిలోమీటర్ల పొడవున మెట్రో నెట్‌వర్క్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.24,269 కోట్లు కాగా.. ఎయిర్‌పోర్ట్ కారిడార్‌తో పనులు ముందుగా మొదలు కానున్నాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పనులను 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది ప్రభుత్వం.
కొత్త లైన్లు ఇవే:
కారిడార్ 1: నాగోల్ – శంషాబాద్ విమానాశ్రయం ( 36.8 కిలోమీటర్లు )
ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట వైపు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ కల్పించే కీలక మార్గం ఇది. ఐటీ ఉద్యోగులు, విమాన ప్రయాణికులకు ఉపయోగపడే అవకాశం ఉంది.
కారిడార్ 2: రాయదుర్గం – కోకాపేట నియోపోలిస్ ( 11.6 కిలోమీటర్లు )
ఈ కారిడార్ ద్వారా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట పరిసరాల్లో నివసించే వారు, ఐటీ ఉద్యోగులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది.
కారిడార్ 3: ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట ( 7.5 కిలోమీటర్లు )
ఓల్డ్ సిటీ ప్రాంతాలకు మెట్రో విస్తరణలో ఈ కారిడార్ కీలకం కానుంది.
కారిడార్ 4: మియాపూర్ – పటాన్‌చెరు ( 13.4 కిలోమీటర్లు )
ఈ కారిడార్ ద్వారా పశ్చిమ హైదరాబాద్ శివారు ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాలకు ప్రయాణ సౌకర్యం పెరిగే అవకాశం ఉంది.
కారిడార్ 5: ఎల్బీనగర్ – హయత్‌నగర్ ( 7.1 కిలోమీటర్లు )
ఈ కారిడార్ ద్వారా తూర్పు వైపు శివారు ప్రాంతాల నుంచి సిటీకి వచ్చే ప్రయాణికులకు మెట్రో సేవలు విస్తరిస్తాయి.
