బంజారాహిల్స్ లో చైన్ స్నాచింగ్

బంజారాహిల్స్ లో చైన్ స్నాచింగ్

జూబ్లీహిల్స్, వెలుగు: గుర్తు తెలియని దుండగులు మహిళ మెడలోని చైన్ లాక్కొని పోయిన ఘటన బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నం.10లో ఉండే బండి శ్రీవిద్య శుక్రవారం ఉదయం 7 గంటలకు  తన కుమార్తెను సిటీ సెంటర్ మాల్ సిగ్నల్ వద్ద స్కూల్ బస్సు ఎక్కించింది. 

అనంతరం ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు బైక్ పై స్పీడ్ గా వచ్చి ఆమె మెడలోని 2.5  తులాల చైన్ లాక్కొని పారిపోయారు. దీంతో ఆమె మెడకు గాయమైంది. బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చైన్ దొంగిలించిన దుండగుల వయస్సు 20 – 25 మధ్య ఉంటుందని బాధితురాలు తెలిపింది.