ఒకవైపు విని ఇదే నిజం అంటే ఎలా.. నిహారిక ఇంటర్వ్యూపై చైతన్య ఫైర్

ఒకవైపు విని ఇదే నిజం అంటే ఎలా.. నిహారిక ఇంటర్వ్యూపై చైతన్య ఫైర్

మెగా డాటర్ నిహారిక(Niharika) ఇటీవల తన భర్త చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda)తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకొని చాలా మంది షాకయ్యారు. అయితే ఈ జంట విడాకులు తీసుకోవడానికి కారణాలు తెలియదు కానీ, నిహారికపై చాలా ట్రోలింగ్స్ జరిగాయి. బ్యాడ్ కామెంట్స్ పెడుతూ చాలా దారుణంగా కామెంట్స్ చేసారు. అయితే ఆ కామెంట్స్ ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు నిహారిక. ఇక తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన వివాహ జీవితం, విడాకుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వైరల్ అవుతున్న వేళ.. ఆ ఇంటర్వ్యూపై ఘాటుగా స్పందించారు చైతన్య జొన్నలగడ్డ. ఇటీవల నిహారికపై జరుగుతున్న ట్రోలింగ్ ని దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. అయితే.. ఈ విషయంలో కేవలం బాధితురాలి పక్షాన్నే మాట్లాడటం, అది ప్రపంచానికి వినిపించడం కరెక్ట్‌ కాదు. మరీ ముఖ్యంగా విడాకుల విషయంలో ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదు. వివాహ బంధం ముగిశాక దాని వల్ల నొప్పి ఇద్దరికీ ఉంటుంది. దాని నుంచి బయటపడడం కూడా ఇద్దరికే ఒకేవిధంగా ఉంటుంది.

ఇలాంటి విషయాల్లో ఆయా సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలి. నిజంగా జరిగిందేంటో తెలుసుకోకుండా ఇలా జడ్జ్‌ చేయడం ఎంత తప్పో.. ఇలా ఒకే కోణంలో విషయాన్ని వివరించడం కూడా అంతే తప్పు. అలా అయితేనే ఇంటర్వ్యూలు చేయండి.. అంటూ ఘాటుగా స్పందించారు చైతన్య జొన్నలగడ్డ. ప్రస్తుతం చైతన్య చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.