గ్రేటర్ వరంగల్/నల్లబెల్లి, వెలుగు: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు స్ఫూర్తిదాయకమని కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి అన్నారు. గురువారం సిటీలోని న్యూ శాయంపేట జంక్షన్లో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి వరంగల్, హన్మకొండ కలెక్టర్లు సత్య శారద, చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ రైతులు, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరవనిత అని కొనియాడారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రొఫెసర్లు సీహెచ్దళపతి, మహిపాల్ రెడ్డి, గణేశ్‌రెడ్డి ఆవిష్కరించారు.
జనగామ అర్బన్, వెలుగు: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జనగామ కలెక్టర్సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ వర్థంతిని తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు చాకలి ఐలమ్మ మనుమరాలు చిట్యాల శ్వేత హాజరై ఐలమ్మ ఫొటో వద్ద నివాళులు అర్పించారు.
వైరా, వెలుగు: వైరా మున్సిపల్ ఆఫీస్‌లో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతిలో చైర్‌పర్సన్ కాపా చంద్రకళ పాల్గొని నివాళులర్పించారు. వైస్ చైర్మన్ కట్ల సంతోష్, కమిషనర్ రామచంద్రరావు, మేనేజర్ సుధీర్, సిబ్బంది పాల్గొన్నారు.
