శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటించిన చిత్రం ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’. పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డా. చింతాడ హేమారావు నిర్మించారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ బాపిరాజు అక్టోబర్ 9న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
గురువారం హైదరాబాద్ లో ఈ సినిమా మీడియా ప్రివ్యూతో పాటు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శ్రవణ్ మాట్లాడుతూ ‘ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. ఇందులోని ప్రతి ట్విస్ట్ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది’ అని చెప్పాడు. తన ఆలోచనల్నీ మాస్ పొయెట్రీ సినిమాగా రూపొందించానని డైరెక్టర్ మంగా శ్రీనివాస్ అన్నాడు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు అన్నారు.
