హాస్పిటల్‌లో చలాకీ చంటి.. ఐసీయూలో చికిత్స

హాస్పిటల్‌లో చలాకీ చంటి.. ఐసీయూలో చికిత్స

జబర్దస్త్‌ ఫేమ్, కమెడియన్‌ చలాకీ చంటి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ఏప్రిల్ 21న ఆయనకు తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. చంటి రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్టు గుర్తించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. 

కొన్ని రోజుల పాటు పలు కారణాల వల్ల జబర్ధస్త్ కామెడీ షోకు దూరంగా ఉన్న చంటి.. ఇటీవలే మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. కేవలం జబర్ధస్త్ లోనే కాకుండా పలు రియాలిటీ షోస్ లోనూ పాల్గొని చంటి ప్రేక్షకులను అలరించారు. గతేడాది బిగ్‌బాస్ సీజ‌న్ సిక్స్‌లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్న చంటి.. ఐదు వారాల పాటు హౌజ్‌లో కొన‌సాగించారు. ఆ తర్వాత చంటి గేమ్ స‌రిగా ఆడ‌లేక బ‌య‌ట‌కు వ‌చ్చిన విషయం తెలిసిందే. వీటితో పాటు చంటి కొన్ని సినిమాల్లోలనూ పలు పాత్రలు పోషించారు.