అనన్య పాండే, ‘కిల్’ ఫేమ్ లక్ష జంటగా రూపొందుతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘చాంద్ మేరా దిల్’. వివేక్ సోనీ దర్శకత్వం వహిస్తుండగా కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బుధవారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. మే 22న సినిమాను విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ట్యాంక్ బండ్, బుద్దుడి విగ్రహాన్ని హైలైట్ చేయడం, కొద్దిరోజుల పాటు ఇక్కడ షూటింగ్ చేయడాన్ని బట్టి హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్ స్టోరీ ఇదని అర్థమవుతోంది.
అలాగే పోస్టర్‌పై ఉన్న ‘‘ప్రేమ.. కాస్త పిచ్చివాళ్లను చేస్తుంది, మీకు తెలుసా..” అనే క్యాప్షన్ ఇంప్రెస్ చేస్తోంది. నిజానికి గత ఏడాదే ఈ చిత్రం విడుదల కావల్సి ఉండగా ఆలస్యమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ వేసవి సెలవులు లక్ష్యంగా మే నెలలో ప్రేక్షకుల ముందుకొస్తోంది.
