
షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది చాందిని చౌదరి. చేసింది తక్కువ ప్రాజెక్టులే అయినా డిఫరెంట్ కాన్సెప్టులను సెలెక్ట్ చేసుకుంటోంది. తాజాగా ‘గామీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి చాందిని పోషించిన పాత్రను పరిచయం చేస్తూ, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో జాహ్నవిగా ఆమె కనిపించనున్నట్టు రివీల్ చేశారు.
ఫ్యాంట్, షర్ట్‌తో కళ్లజోడు పెట్టుకుని వీధుల్లో నడుస్తూ కనిపిస్తున్న ఆమె ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. ఇందులో అఘోరా పాత్రలో విశ్వక్ సేన్ నటించగా, చాందిని క్యారెక్టర్ కూడా క్యూరియాసిటీని పెంచేలా ఉంటుందని తెలుస్తోంది. కార్తీక్ శబరీష్ నిర్మాతగా వ్యవహరించిన ఈ అడ్వెంచర్ డ్రామాను క్రౌడ్ ఫండింగ్‌తో నిర్మించారు. నరేష్ కుమారన్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 29న సినిమా విడుదల కానుంది.