జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్లట్లేదు : చంద్రబాబు

జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్లట్లేదు : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  రేపు విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి పలువురు జాతీయ నాయకులతోపాటు టీడీపీ అధ్యక్షడు చంద్రబాబును కూడా హాజరుకావాలని జగన్ కోరారు.

కాని చంద్రబాబు మాత్రం  జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తనకు బదులుగా ఓ ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలతో కూడిన ప్రతినిధి బ‌ృందాన్ని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  పంపాలని నిర్ణయించారు. ఈ ఇద్దరు నేతలు రేపు ఉదయం తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లి అభినందిస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అనంతరం విజయవాడలోని జరిగే జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వీరు హాజరవుతారట.

మరో విషయం ఏంటంటే 2014 లో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు కూడా తన ప్రమాణ స్వీకారానికి జగన్ ను ఆహ్వానించారు. కాని జగన్ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు.